నరసరావుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుమారు 60 సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించినట్టు మొదటి పట్టణ ఎస్ఐ ఎన్ వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మృత దేహాన్ని శవ పరీక్షల నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు నరసరావుపేట మొదటి పట్టణ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని ఆయన కోరారు.