యడ్లపాడు మండలం సొలస గ్రామంలో గుంటూరుకు చెందిన నెక్ట్స్ జనరేషన్సేవ్ ఆర్గనైజేషన్, హోప్ విన్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో మండలంలోని సొలస గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం జరిగింది. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ నజీరుద్దీన్, డాక్టర్ రాహుల్రెడ్డిలు పాల్గొని వైద్య సేవలు అందించారు. శిబిరానికి హాజరైన 250 మందికి ముందుగా షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలను నిర్వహించారు. అనంతరం కంటి పరీక్షలు నిర్వహించారు. 20 మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామ పెద్దలు మద్దూరి వీరారెడ్డి క్యాంపు నిర్వహణకు సహకారాన్ని అందించారు. కార్యక్రమాలను ఫౌండేషన్ చైర్మన్ నాగండ్ల శివరామకృష్ణ, సభ్యులు కృష్ణ వేణి, హోప్ హాస్పటల్ మేనేజర్ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.