బొండపల్లి మండలం తమతాడా గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనులు పరిశీలించి వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పనులకు వెళ్తున్న వారికి మెడికల్ కిట్లు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. బిల్లులు కూడా సకాలంలో చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.