జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం తిరుపతి నగరంలోని శెట్టిపల్లి, ఇందిరామైదానం, ఫిష్ మార్కెట్ వెనుక ఉన్న సచివాలయాల వద్ద మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అర్హత ఉండి కూడా కొన్ని సర్టిఫికెట్లు లేవనే కారణంతో సంక్షేమ ఫలాలు అందుకోని వారి కోసం సురక్ష పెట్టారన్నారు.