గజపతినగరం మండలంలోని కొనిసి గ్రామంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. లబ్ధిదారులకు సకాలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa