గంజాయి, డ్రగ్స్ లేని జిల్లాగా చేయుటలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్నారు. అమరావతి నుండి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబులు వర్చువల్ విధానంలో సమీక్షించారు. తిరుపతి జిల్లా నుండి కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.