ప్రజలకోసం బ్రిటీషు వారిపై పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మనందరికి ఆదర్శినియులని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అల్లూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషదాయకమన్నారు.