నగరి: సినీ నటి జీవిత రాజశేఖర్ చిత్తూరు జిల్లా నగిరి పట్టణ పరిధిలోని మేజిస్ట్రేట్ కోర్టుకు బుధవారం హాజరయ్యారు. గరుడవేగ సినిమా ఆర్థిక లావాదేవీలు కేసు గత తొమ్మిది నెలలుగా నగిరి కోర్టులో జరుగుతోంది. విజయపురం మండలంలోని మహారాజపురం గ్రామానికి చెందిన సాయి శక్తి ఇంజనీరింగ్ కాలేజీ యజమాని కోటేశ్వర రాజు భార్య హిమరాజాకు జీవిత రాజశేఖర్ ఇచ్చినా చెక్కు బౌన్స్ కావడంతో ఈ కేసు నమోదయింది.