ఏపీలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారిపై పీడీయాక్టు ప్రయోగించనున్నారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో నేరస్తులకు బెయిల్ రాకుండా చూడాలని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పార్సిల్, కొరియర్ వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ సరఫరాపై టోల్ ఫ్రీ నెంబర్ 14500కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.