ధర్మవరం పట్టణం 5వ వార్డు శివానగర్లో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సతీమణి కేతిరెడ్డి సుప్రియ పాల్గొన్నారు. శివానగర్లోని పరమేశ్వర ఫంక్షన్ హాల్ నుండి ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి వార్డులోని ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందాయా లేదా అందితే ఏ మేరకు లబ్ధి పొందారు అని అడిగి తెలుసుకున్నారు. అలాగే,ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.