పల్నాడు జిల్లా, ప్రధాన కేంద్రమైన నరసరావుపేట మండలం పమిడిమర్రు వద్ద స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ఆక్స్‌ఫర్డ్ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లడంతో బస్సులోని విద్యార్థులు గాయాలపాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో గాయపడిన విద్యార్థులను నరసరావుపేట ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని తమ బిడ్డల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురవడంతో విద్యార్థులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa