అనంతపురం జిల్లాలో సీఐ మృతి పట్ల టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సీఐ ఆనందరావుది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ హత్యేనని అయన పేర్కొన్నారు. నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. సీఐ ఆనందరావు ఆత్మహత్యపై విచారణ జరుపుతామన్నారు. సీఐ ఆనందరావు కుటుంబానికి... పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ఉందని.. దానిని పోలీసులు బయట పెట్టాలన్నారు. సీఐ ఆత్మహత్య కేసును టీడీపీ ప్రభుత్వం వచ్చాక రీ ఓపెన్ చేస్తామన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిడి తట్టుకోలేక ఆనందరావు చనిపోయాడని జేసీ పేర్కొన్నారు.