రాంబిల్లి: మండలం గోకివాడ, పంచదార్ల సచివాలయాల్లో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అర్హులైన వారందరికీ 11 రకాల సుమారు 550 సర్టిఫికెట్లను ఎలమంచిలి శాసనసభ్యులు యు. వి రమణమూర్తి రాజు (కన్నబాబు) మరియు మాజీ డిసిసిబి చైర్మన్ యు. సుకుమార్ వర్మ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ, అర్హులై ఉండి ఇంత వరకు ఎటువంటి సంక్షేమ౦ అందనివారికి ఈ జగనన్న సురక్ష కార్యక్రమం దోహదపడుతుందన్నారు.