జగన్ సర్కారు కొలువుదీరిన కొత్తలోనే 2019లో ప్రభుత్వ, సర్వీస్ కాంట్రాక్టు పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. దీని ప్రకారం ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనుల్లో మహిళలకు సగం కేటాయించాలి. ఈ చట్టం గురించి అప్పట్లో జగన్ సర్కారు ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. ఆ తర్వాత ఈ చట్టాన్ని అటకెక్కించింది అని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ప్రత్యేక సమావేశాల్లో వారు మాట్లాడుతూ.... రాష్ట్రంలో ఎక్కడా ఒక్క మహిళకు కూడా ఈ చట్టం ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన దాఖలాల్లేవు. ప్రభుత్వం ఏమో అన్ని పనులు చేశాం, ఇన్ని పనులు చేశాం.. ఇన్ని నిధులు ఖర్చు చేశామంటూ గొప్పగా చెప్పుకొంటోంది. సంక్షేమ హాస్టళ్లకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గుడ్లు సరఫరా నుంచి వంట చేయడం, మానవ వనరుల సరఫరా తదితర వాటికి టెండర్లు పిలుస్తూనే ఉంది. మహిళలకు మాత్రం ఎక్కడా కాంట్రాక్టులు కేటాయించలేదు అని తెలియజేసారు.