అమరావతిలోని ఆర్-5 జోన్‌కు భూ బదలాయింపుపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. భూ బదలాయింపు చేసే అధికారం సీఆర్డీఏకు లేదని పిటిషనర్ తెలిపారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కాగా ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.