ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుందని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు కొనియాడారు. మోపిదేవి - 1 గ్రామ సచివాలయం వద్ద బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు సురక్షలో సర్టిఫికెట్లు అందిస్తున్నామన్నారు.