సర్పంచులకు ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. సీఎం సహా వైసీపీ నేతలదోపిడీతో పల్లె సీమలు బలైపోతున్నాయని విమర్శించారు. పంచాయతీలకు నిధులివ్వకుండా గ్రామాలను అభివృద్ధికి దూరంచేసి, సర్పంచులను రోడ్డు పాలు చేశారని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులపై ప్రతాపం చూపే సీఎం.. తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలన్నారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన రూ.8,700 కోట్ల నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.