రాష్ట్రంలో గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరాను ఉక్కుపాదంతో అణచివేసేందుకు సంబంధిత శాఖలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ అపెక్స్ కమిటీ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలన్నారు. వీటిని విక్రయిస్తూ పట్టుబడ్డ వారికి బెయిల్ రాకుండా చూడాలని నిర్దేశించారు. రైల్వే పార్శిళ్లలోనూ తనిఖీలు జరపాలని సూచించారు. మత్తు పదార్థాల సరఫరాపై టోల్‌ఫ్రీ నంబర్ 14500కు ప్రజలు ఫిర్యాదు చేయాలని కోరారు.