ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలకు చిక్కిన పండుగప్ప,,,ఏకంగా రూ.17,500 వేలకు కొనుగోలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2023, 06:47 PM

కాకినాడ జిల్లాలో మత్స్యకారుల వలకు భారీ పండుగప్ప చేప చిక్కింది. యానాం మత్యకారులు భైరవపాలెం దగ్గర వేటకు వెళ్లారు. సముద్రంలో వల వేయగా.. భారీ పండుగప్ప దొరికింది. సాధారణంగా ఈ పండుగప్ప చేపలు రెండు కేజీల నుంచి 15 కేజీల వరకు ఉంటాయి. కానీ ఈ చేప మాత్రం 25 కేజీల వరకు ఉంది. ఈ చేపకు వేలం పాట నిర్వహించగా మహిపాల చిన్న అనే వ్యక్తి రూ. 17వేల 500కు దక్కించుకున్నారు. ఈ పండుగప్పను చేపలలో రారాజుగా పిలుస్తుంటారు.. మాంసం ప్రియులకు అత్యంత ఇష్టమైన చేపగా చెబుతుంటారు.


రెండు రోజుల క్రితం కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ పండుగప్ప చేప మత్స్యకారులకు చిక్కింది. యానాం సమీపంలో గౌతమి గోదావరి నది దగ్గర మత్స్యకారుల వలకు ఈ చేప దొరికింది. ఈ పండుగప్ప చేప 15 కేజీల బరువు ఉంది. ఈ చేపను దక్కించుకోవడానికి స్తానికులు పోటీపడగా.. పొన్నమండ భద్రం, రత్నం దంపతులు రూ.9 వేలకు దక్కించుకున్నారు.


ఈ చేప రుచిగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రపు నీటితో పాటుగా మంచినీటిలో పెరిగే ఈ పండుగప్పకు వెన్నుపూసలో మాత్రమే ముల్లు ఉంటుందట. చేప చాలా మెత్తగా ఉండి నోట్లో ఇట్టే కరిగిపోతుందని.. ఈ చేపను తింటే శరీరానికి కావాల్సిన చాలా ప్రొటీన్లు అందుతాయంటారు. మాంసాహారం మాత్రమే తినడం ఈ చేప ప్రత్యేకతగా చెబుతున్నారు మత్స్యకారులు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa