ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు పెరిగిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళుతోంది.. నిజాలు తెలియకుండానే చాలామంది వీడియోనో, ఫేక్ న్యూసో.. ఇలా రాగానే అలా షేర్ చేస్తున్నారు. అయితే ప్రజలకు అసలు నిజాలు చెప్ప ఫ్యాక్ట్ చెక్ టీమ్‌లు పని చేస్తున్నాయి. ఏపీలో కూడా ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఫేక్ వీడియోలు, వార్తల వెనుక అసలు నిజాలను ప్రజల ముందు పెడుతోంది. తాజాగా జగన్ సర్కార్ ఓ దివ్యాంగురాలి పింఛన్ తొలిగించిందంటూ ఓ వీడియోతో తప్పుడు ప్రచారం జరిగింది.
ఏపీకి చెందిన ఓ దివ్యాంగురాలి పింఛన్‌ను అన్యాయంగా తొలగించారని.. ఆమె కోపంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తోందని వీడియోను కొందరు పోస్ట్ చేశారు. ఆమె పేరు అరుంధతి.. ప్రభుత్వం ఆమె పింఛన్‌ను తొలగించినట్లు ప్రచారం చేశారు. ఆ యువతికి గత ప్రభుత్వ హయాంలో పింఛన్ వచ్చేదని.. కానీ కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే కారణంతో ఇప్పుడు పింఛన్ తొలగించినట్లు వీడియోతో చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఒరిజినల్ వీడియోను మార్చేసి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఈ వీడియో.. ఒడిశాలో పూరి రథయాత్ర ఉత్సవాల సందర్భంగా.. ఓ దివ్యాంగురాలు కృష్ణ భజన పాటలకు డ్యాన్స్ చేసిన సమయంలో తీశారని క్లారిటీ ఇచ్చారు. వీడియో మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారని.. ఒరిజినల్ వీడియో లింక్‌ను షేర్ చేసింది.
కొంతమంది ఈ ఫేక్ వీడియోతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కొందరు ఒరిజినల్ వీడియోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసినట్లు తెలిపింది. ఈ వీడియో గురించి వాస్తవాలు తెలియకుండా షేర్ చేశారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. ఇలాంటి వీడియోల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే ఇలాంటివి పోస్ట్ చేయాలని సూచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa