ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త చీఫ్ పురందేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా తనను నియమించినందుకు జేపీ.నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై నేతలు చర్చించారు. భవిష్యత్తులో పార్టీ తరపున చేపట్టబోయే కార్యక్రమాల గురించి మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన బాధ్యత, నిబద్దత గురించి జేపీ.నడ్డాకు వివరించినట్లు పురందేశ్వరి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa