చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న ప్రధాని మోడీ ర్యాలీకి 40 మందితో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతులు సూరజ్‌పూర్ జిల్లాకు చెందిన రుక్దేవ్ (45), సాజన్ (30), అక్రమ్ రజా (28)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.