రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరు మండలంలో భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార బస్సు యాత్రలో భాగంగా చిన్నకడబూరులో జరిగిన సభలో తిక్కారెడ్డి మాట్లాడారు. జగన్ లాగా చంద్రబాబు మోసం చేయరని, చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే అందరికీ మేలు జరుగుతుందని, మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరాలని కోరారు.