పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. యాత్రలో పవన్ తన విధానాలను చెప్పుకోవాలి కానీ, ఇతరులను దూషించడం సరికాదని హితవు పలికారు. సేవా దృక్ఫథంతో పనిచేస్తున్న వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందనడం దిగజారుడుతనం. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నాడు. వలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు కూడా గతంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. వలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు. ఏ ఆధారాలతో వలంటీర్ల పై పవన్ ఆరోపణలు చేశాడో చెప్పాలంటూ మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు.