సినిమా డైలాగులు కొట్టుకుంటూ, తనకి తానేదో గొప్ప వ్యక్తిగా ఫీలవుతూ పదిమందిలో తిరిగితే పర్వాలేదు, కానీ స్వచ్చందంగా సేవ చేసే వాలంటీర్లను విమర్శిస్తే మాత్రం పవన్ కల్యాణ్ కి తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి హెచ్చరించారు. యల్లనూరు మండలం పాతపల్లి, కృష్ణాపురం గ్రామాల్లో పద్మావతి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల ఇళ్లల్లో వాలంటీర్లు కుటుంబ సభ్యుల్లా మారిపోయారని అన్నారు. ప్రతి నెలా మొదటి తారీఖున తమ పిల్లల కోసం ఎదురు చూసినట్టు వాలంటీర్ల కోసం వృద్ధులందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. వారిని ప్రేమతో దీవించి పంపిస్తున్నారని తెలిపారు. అలాంటి వాలంటీర్లను పట్టుకుని పవన్ కల్యాణ్ లేనిపోని అవాకులు చవాకులు పేలితే, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.