ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి ఆళ్లనాని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ సాక్షిగా.. వైయస్ జగన్‌పై వారాహి యాత్రలో పవన్ దుష్ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై, సమస్యలపై పవన్‌కు కనీస అవగాహన లేదన్నారు. ఏలూరు నియోజకవర్గ జనసేన సభకు జిల్లా నలుమూలల నుంచి జనాన్ని తరలించారన్నారు. ఏలూరులో సమస్యలపై తమ్మిలేరు రక్షణ గోడను వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించామన్నారు. దశాబ్దన్నర కాలం పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏనాడూ తమ్మిలేరు ముంపుపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.