వాలంటీర్ లను మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు అని మేయర్ సురేష్ బాబు అన్నారు. మంగళవారం కడప నగరంలోని వైసిపీ జిల్లా కార్యాలయంలో కడప మేయర్ సురేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో కరోనా వచ్చినప్పుడు శబాష్ అనిపించుకున్న రాష్ట్రం ఏపీ అని కరోనా సమయంలో వాలంటీర్ లు నిరంతరం పనిచేసి ప్రజలకు సేవ చేశారన్నారు. అలాంటి వాలంటీర్ లను పవన్ కళ్యాణ్ మాట్లాడడం సబబు కాదన్నారు.