రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జగ్గంపేట ఎస్ఐ సి హెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో రహదారిపై పలుచోట్ల ఉన్న గోతులను పూడ్చివేసే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ముఖ్యంగా జగ్గంపేటలోని కాకినాడ రోడ్ లోని అక్కడక్కడ ఏర్పడిన రహదారిపై గుంతలను, జగ్గంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఏలేశ్వరం వైపు మలుపు తిరిగే వద్ద వాహనాల తాటికి పడిన రంధ్రాన్ని పూడ్చి వేసేందుకు హైవే సిబ్బందితో పనులు చేపట్టి, రహదారిపై పడిన గోతులను ద్వారా తారు, కంకరతో పూడ్చివేశారు.