ప్రకాశం జిల్లా, సింగరాయకొండ ఎమ్మెల్యే స్వామి టీడీపీ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా ఏడాదికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తామని వివరించారు. సంవ త్సరానికి మహిళలకు మూడు గ్యాస్ సిలెండర్లు, జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. బీసీలకు దన్నుకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో యువతకు రూ.20 లక్షల ఉద్యోలు కలిస్తామని స్వామి తెలిపారు.