జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో మారు గళమెత్తారు. వలంటీర్ వ్యవస్థను కోర్టులో చాలెంజ్‌చేస్తానని ప్రకటించారు. వారు లేకపోతే దేశం ఆగిపోయిందా.. రాష్ట్రంలో పంపిణీ కార్యక్రమం ఆగిపోయిందా అని ప్రశ్నించారు. వలంటీర్ల వ్యవస్థపై తనకు కోపం లేదని.. కానీ దానిపై నియంత్రణ లేకపోవడాన్నే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. పిండా కూడు అంటే మన ముఖ్యమంత్రి జగన్ పిండి వంటలు అనుకుంటాడని.. శ్రాద్ధానికి, శ్రావణ శుక్రవారానికి తేడా తెలియదని అన్నారు. వారాహికి, వరాహికి తేడా తెలియని మహానుభావుడనీ ఎద్దేవాచేశారు. తాను ఎక్కడ జనవాణి నిర్వహిస్తున్న వలంటీర్లపైన ఫిర్యాదులు వినిపిస్తూనే ఉన్నాయని ఆయన చెప్పారు.