టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ యాజమాన్యం తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. ఈసారి జీతాల పెంపును వాయిదా వేయాలని నిర్ణయించారు. కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ స్థాయికి దిగువన ఉన్న వారందరికీ ఈసారి జీతాల పెంపు ఉండదని సమాచారం. ఇన్ఫోసిస్లో జీతాల పెంపు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ సాధారణంగా జూన్ నెలలోనే పెరిగిన జీతం గురించి ఉద్యోగులకు తెలియజేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.