చంద్రయాన్ -3 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. 40 రోజుల తర్వాత చంద్రయాన్-3 చంద్రుడిని చేరుకొంటుంది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోతుంది. చంద్రయాన్-3కి రూ.650 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం.