కడియం మండలంలోని పొట్టిలంక గ్రామంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల జేసీఎస్ చైర్మన్ తాడల చక్రవర్తి పాల్గొని మాట్లాడారు. ప్రజలకు తక్షణమే సమస్యలు పరిష్కరించే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. వివిధ రకాలకు సంబంధించి 908 సర్టిఫికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కొత్తపల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.