ఏపీలో బీజేపీకి కొత్త నాయకత్వం రావడంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. పురందేశ్వరి నియామకం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని, ఆమెను చీఫ్గా ప్రకటించడం ఎంతో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు. త్వరలో బీజేపీ, జనసేన కలసి అధికారంలోకి రానున్నాయని వెల్లడించారు. 20 ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.