ఉరవకొండ పట్టణంలోని యాదవ కల్యాణ మండపంలో గురువారం నియోజకవర్గ బెస్త కుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బెస్త కులస్తుల కమ్మూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన 20 సెంట్ల స్థలం తీర్మాణ పత్రాన్ని వై. విశ్వేశ్వరరెడ్డి కులపెద్దలకు అందజేశారు.