తాడిపత్రి పట్టణంలో యువకుడు బ్లేడుతో కోసుకుని గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఓంశాంతి నగర్ కు చెందిన భరత్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు హుటా హుటిన తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.