టీడీపీ ఆధ్వర్యంలో చంద్రన్న పాలనలోనే ఎస్సీలకు భరోసా లభించిందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు అన్యా యం చేసిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ఎందుకు రద్దు చేసిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ సంఘ ప్రతినిధులు పెద్దబాబు, కొమ్మునూరు వీరయ్య, రమేష్, అబ్రహం, గ్రామపార్టీ అధ్యక్షులు షేక్ అమీర్, మాజీ ఎంపీటీసీ రాజయ్య, మాజీసర్పంచ్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, టీడీపీ నాయకులు బొమ్మినేని వెంకటేశ్వర్లు, మునయ్య తదితరులు పాల్గొన్నారు.