కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శనివారం రైతు బజార్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ తనిఖీ చేశారు. వినియోగదారులకు బోర్డుపై సూచించిన ప్రకారం ధరలకు రైతులు కూరగాయలు అమ్ముతున్నారో లేదో నేరుగా పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. రైతు పండించే పంట ఏ విధంగా ఉన్నది అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు దేశానికి వెన్నుముక అని తెలిపారు.