నిరుపేద కుటుంబానికి కరెంట్ బిల్లు రూ.26,600 రావడంతో పాటు, విద్యుత్ కనెక్షన్ తొలగించడాన్ని నిరశిస్తూ బుట్టాయగూడెంలో గురువారం రాత్రి పార్టీ మండల అధ్యక్షుడు లంకా సత్యనారాయణ, పార్టీ నాయకులతో కలసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ.... బుట్టాయగూడెంకు చెందిన ఒక నిరుపేద నోముల రాంబాబు పూరిగుడిసెకు వేలల్లో వస్తున్న కరెంటు బిల్లును కట్టలేమని చెప్పినప్పటికీ విద్యుత్ కనెక్షన్ తొలగించడం అన్యాయమన్నారు. సమస్య ను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.