భవన నిర్మాణ రంగానికి ఉపకరించే విధానాలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందుంటుందని, ఇంటి కొనుగోలుదారులకు అన్నిసేవలు ఒకేచోట దొరికేలా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు తెలియజేసారు.ఎ.కన్వెషన్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన నరెడ్కో ప్రాపర్టీ ఎక్స్‌పోను అయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్మే వెలంపల్లి మాట్లాడుతూ, సొంతింటి కల నిజం చేసుకునే వారు ఈ ప్రదర్శనను సద్వినియెగం చేసుకోవాలన్నారు. నరెడ్కో రాష్ట్ర సెక్రటరీ జనరల్ మామిడి సీతారామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వైవీ.రమణరావు మాట్లాడుతూ, భవన నిర్మాణరంగానికి ప్రభుత్వ చేయూత ఎంతో అవసరమని, రియల్ ఎస్టేట్ సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం హర్షణీమన్నారు. 55 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తు, కోనుగోలుదారులకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాయని, మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేత దేవినేని అవినాశ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నరెడ్కో ప్రతినిధులు సందీప్ మండవ, వాసిరెడ్డి వంశీ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.