దేవాదాయ శాఖలో అవినీతి చేసిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోకపోతే మిమ్మల్ని కూడా అవినీతి అధికారులుగా చూడాల్సి వస్తుంది అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. అయన మాట్లాడుతూ.... మీరు నిజాయితీపరులైతే శాఖా పరమైన విచారణ చేసి అన్ని వాస్తవాలు బయట పెట్టాలి. 90 లక్షల రూపాయల అభివృద్ధి పనులు పక్కదారి పట్టాయి. దేవాదాయ ఆస్తులను కాపాడతారా? కబ్జా చేసే వారిని ప్రోత్సహిస్తారా?. చనిపోయిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి 36 లక్షలు కాజేశారు. ఈవో హేమలతకు తెలియకుండా రెండు బిల్లులు ఎలా వెళ్లాయి. పాత శివాలయంలో జరిగిన అవినీతిలో ఈవోకి, వెల్లంపల్లికి భాగస్వామ్యం ఉంది.’’ అని పోతిన మహేష్ ఆరోపించారు.