గురువారం వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ నగర పరిధిలోని సుజాతనగర్లో గల ఇంద్రాణి ఫంక్షన్ హాలులో సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెందుర్తి నుంచే బరిలోకి దిగుతానని, ఏ పార్టీలో చేరతాననే క్లారిటీ 80 శాతం మీకు ఉండి ఉంటుందని అనుకుంటున్నానన్నారు. దాంతో ఆయన అనుచరులు ‘జనసేన...జై పవన్‌కల్యాణ్’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ఆయన ‘మీరు ఊహించింది వాస్తవం. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. రెండు రోజుల్లో పార్టీలో చేరికపై కార్యచరణ ప్రణాళిక ప్రకటిస్తా’ అని అన్నారు.