2023-24 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల తాత్కాలిక జాబితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు షెడ్యూలు విడుదల చేశారని, ఏపీలో ఎందుకు చేయలేదని విలేకరులు వేసిన ప్రశ్నకు మంత్రి మాట్లాడుతూ..... తెలంగాణలో విద్యారంగం పూర్తి అధ్వాన్నంగా ఉంది, అసలు తెలంగాణతో ఏపీని పోల్చి చూడొద్దని స్పష్టం చేశారు. విద్యారంగం విషయంలో దేశమంతా ఏపీ వైపే చూస్తోందని, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. ఐఐటీలు, ఎన్‌ఐటీల ప్రవేశాలు ఇంకా పూర్తికాలేదని, అవి అయ్యాక ఎంసెట్ షెడ్యూలు ప్రకటిస్తామని బొత్స పేర్కొన్నారు.