తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శనివారం పునః ప్రారంభం కానుంది. కొన్ని కారణాల వలన న్యాయస్థానం ముందు హాజరు కావలసిన నేపథ్యంలో 13, 14వ తేదీలు పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆ పనులు పూర్తి చేసుకున్న లోకేష్ తిరిగి శనివారం యథావిధిగా పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. రాత్రి 7 గంటలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కందుకూరు నియోజకవర్గానికి చేరుకుంటుంది. ఉదయగిరి టీడీపీ ఇన్‌చార్జి బొల్లినేని రామారావు, కందుకూరు ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావులు పాదయాత్రకు సన్నాహాలు చేసుకొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa