ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ భూములని కాపాడండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 16, 2023, 11:11 AM

రాష్ట్రంలో అటవీ భూమి ఆక్రమణలకు గురవుతుందని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూముల ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు శనివారం లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం అల్లంచెర్లరాజుపాలెంలోని పాత సర్వే నంబరు 453లో పర్యావరణపరంగా విలువైన అటవీ భూముల ఆక్రమణకు జరుగుతున్న ప్రయత్నాలకు, తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించడానికి వైసీపీ ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అటవీ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. తక్షణమే మొత్తం అటవీ భూమిని సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలి. అని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com