అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం నియోజక వర్గం, వెంకటాయపాలెంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రి వేణుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో వైసీపీ గెలుపులో కీలకపాత్ర వహించిన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, కార్యకర్తలు సమీకరణకు పిల్లి సుభాష్ చంద్ర బోస్ వర్గీయులు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బోస్ తనయుడు సూర్య ప్రకాష్‌ను ఎన్నికల బరిలో నిలిపే దిశగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలియవచ్చింది.