‘‘రాయలసీమ దుర్భిక్ష నివారణ పనుల పేరుతో రూ.900 కోట్లు అక్రమ చెల్లింపులు చేశారని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఫ్రంట్ లోడింగ్ కింద ఇవ్వవచ్చని మంత్రి అంబటి రాంబాబు చెప్పారని, కావున అక్రమం జరిగిందని ఆయనే ఒప్పుకున్నట్లే అని దేవినేని ఉమామహేశ్వరరావు తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ఖర్చుల కోసం తమకు చెందిన కాంట్రాక్టర్లకు భారీగా బిల్లులు విడుదల చేశారు. అలా వచ్చిన డబ్బును తీసుకువెళ్లి ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్లు నిల్వ చేస్తున్నారని ఆరోపించారు.