పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలపైనా లాఠీచార్జి చేశారు.వివరాల్లోకి వెళ్ళితే....... కోటప్పకొండ రోడ్డులో ఉన్న అమరావతి హోమ్స్‌లోని ఓ ఇంటి విషయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. టీడీపీ నేత సుబ్బారావు కుటుంబ సభ్యుడు బాకీ కింద సదరు ఇంటిని తనఖా పెట్టుకున్నారు. ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే విషయంలో వైసీపీ కార్యకర్తలకు, సుబ్బారావుకు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. దాడుల్లో పోలీసు వాహనం అద్దం పగిలిపోయింది.