బహుజనులకు రాయితీలు కాదు, అధికారంలో భాగస్వామ్యం కావాలని జై భీమ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగ విజయకుమార్ అన్నారు. జనాభాలో 85% ఉన్న ఎస్సీ , ఎస్టీ బీసీ బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ రాయితీలకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సత్తెనపల్లి పురవీధుల్లో జై భీమ్ భారత్ పార్టీ గోడ చిత్రాలు అంటిస్తూ పార్టీని గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa