సీఎం జగన్ ఈ నెల 24వ తేదీన ఆర్- 5 జోన్ లో పేదల ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం హర్షనీయం అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారంతో 1024వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కొంటూ పేదలకు మేలు చేయడం ఆనందంగా ఉందన్నారు.